కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆస్తమా డే

 కిమ్స్ సన్ షైన్  హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆస్తమా డే సందర్భంగా అవగాహన వాకథాన్
ఇన్ హెల్లెర్స్ వాడకంపై అపోహ వద్దు - డాక్టర్ ఎ.వి గురవారెడ్డి
ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్, ఫల్మొనాలజి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన వాకథాన్ ను నిర్వహించారు. బేగంపేట కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ నుంచి రసూల్పురా చౌరస్తా మీదుగా నిర్వహించిన అవగాహన వాకథాన్ న్ను కిమ్స్ సన్ షైన్  హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరః డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు ఆస్తమా అంటే భయపడేవారని ఇప్పుడు ఆస్తమా మేనేజ్మెంట్ బాగా పెరిగిందని, ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని, ఆస్తమాను అదుపులో ఉంచేందుకు అద్భుతమైన ఇన్ హెల్లెర్స్ అందుబాటులో ఉన్నాయని వీటిని నిపుణులైన డాక్టర్ల ప్యవేక్షణలో తీసుకుంటే ఆస్తమాను అదుపులో ఉంచుకోవడమే కాదు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. కిమ్స్ సన్ షైన్  హాస్పిటల్లో నిపుణులైన డాక్టర్లతో ఫల్మొనాలజి టీం సేవలందిస్తోందన్నారు. కిమ్స్ సన్ షైన్  హాస్పిటల్ ఫల్మొనాలజి డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి, ఇంటర్వెన్షనల్ ఫల్మొనాలజిస్ట్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆస్తమా బారిన పడి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 260 మిలియన్ల మంది ప్రభావితం అవుతుంటే, ప్రతి సంవత్సరం 4లక్షల 50వేల కంటే ఎక్కువ మరణాలకు కారణమవుతోందని, భారతదేశంలో 1.36 బిలియన్ల జనాభాలో 34 నుంచి 35 బిలియన్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారని, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని, ప్రతి సంవత్సరం 50వేల కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఇన్ హెల్లెర్స్ వాడటం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే, ఇవేమి మీకు హాన్ని చేసేవి కాదని ప్రజలకు తెలియజెప్పేందుకే ఈ వాకథాన్ నిర్వహించామన్నారు. అనంతరం సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ ఫల్మొనాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాకథాను నిర్వహించినట్లు తెలిపారు. హాస్పిటల్లో సివియర్ ఆస్తమా క్లినిక్  నిర్వహిస్తూ అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్తమా ప్యాకేజిని మే నెల వ్యాప్తంగా కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్లో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఫల్మొనాలజిస్ట్ డాక్టర్ కునాల్ వాఘ్రే మాట్లాడుతూ ఆస్తమాకు సరైన చికిత్స అందిస్తే జీవితాంతం అదుపులో ఉంచుకోవచ్చని, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని సూచించారు. డాక్టర్ స్వాతి రెడ్డి మాట్లాడుతూ ఆస్తమా అనగానే భయపడాల్సిన పనిలేదని, ఇన్ హెల్లెర్స్ రెగ్యులర్గా వాడుతూ సరైన చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాకథాన్లో డాక్టర్ కె. తనుశ్రీ, డాక్టర్ భవ్య, డాక్టర్ రుచితోపాటు ఆస్తమాకు చికిత్స తీసుకొని సాధారణ జీవితం గడుపుతున్న రోగులు, నర్సింగ్ విద్యార్థులు వాకతాన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 


 

 

Comments

Popular posts from this blog

Tamannaah Bhatia named Brand Ambassador for Sitaare Gold and Diamonds

Dhanraj Jain Jewellers Announces ‘Festive Lucky Draw 2026’ with Prizes Worth Upto ₹30 Lakhs

Introducing 'Kanchi Cafe': A Divine Culinary Experience in the Heart of Hitec City