కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో భుజం గాయాలు ఫ్రాక్చర్స్ పై వర్క్ షాప్

 ఆర్థోపెడిక్ రంగంలో వస్తున్న ఆధునిక వైద్య విధానాలను ఎప్పటికప్పుడు అందిపిచ్చుకుంటూ ముందుకు వెళ్లడంతో పాటు భుజం గాయాలు, ఫ్రాక్చర్స్, కండరాలు దెబ్బ తినడం, ఫ్రొజన్ షోల్డర్ వంటి సమస్యలకు ఆధునిక శాస్త్ర చికిత్స పద్ధతులు  ఆర్థో స్కోపి ఎండోస్కోపీ విధానాలతో సరి చేయవచ్చని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ చీఫ్ ఆఫ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

    మంగళవారం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో షోల్డర్ సమస్యలకు ఆధునిక శాస్త్ర చికిత్సలు అనే అంశంపై లైవ్ సర్జరీ తో పాటు వర్క్ షాప్ ను నిర్వహించారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ చీఫ్ ఆఫ్ షోల్డర్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భుజాలకు సంబంధించి ప్రోజన్ షోల్డర్, కండరాల గాయాలు, ఫ్రాక్చర్స్,  రొటేట్ కప్ మజిల్స్ దెబ్బతినడం వంటి సమస్యలను ఆధునిక శాస్త్ర చికిత్స విధానాలైన ఆర్తోస్కోపీ, ఎండోస్కోపీ విధానాలతో సరి చేయవచ్చని తెలిపారు. ఈ శస్త్ర చికిత్స విధానాల వల్ల వెంటనే కోల్పోవడంతో పాటు తిరిగి స్పోర్ట్స్ ఆడేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ తో శాస్త్ర చికిత్సకు ముందే పేషెంట్ ప్లానింగ్ టెక్నాలజీ ద్వారా ఏ సైజు జాయింట్ వేయాలనే విషయాలను ముందుగానే నిర్ధారించుకునే అవకాశాలు కూడా ఈ టెక్నాలజీ ఆధారంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ ఆధునిక శాస్త్ర చికిత్స విధానాలను శాస్త్ర చికిత్స నిప్పులకు తెలియజేసేందుకు వర్క్ షాప్ ను నిర్వహించినట్లు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

   ఈ సందర్భంగా ఆస్ట్రేలియా, బ్రిస్ బేయిన్ కు చెందిన షోల్డర్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఆసీస్ గుప్తా ప్రత్యేకంగా హాజరయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డాక్టర్ ఆసీస్ గుప్తా భుజం నొప్పి నిర్వహణ భుజం గాయాలు శాస్త్ర చికిత్సలు వంటి కీలక అంశాలపై ప్రసంగించారు. వర్క్ షాప్ లో భాగంగా సర్జరీ చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ సన్ షైన్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్  ఆర్థో స్కోపి సర్జన్ డాక్టర్ కుషాల్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నుంచి 80 మంది శాస్త్ర చికిత్స నిపుణులు పాల్గొన్నారు.

 


 

Comments

Popular posts from this blog

Dhanraj Jain Jewellers Announces ‘Festive Lucky Draw 2026’ with Prizes Worth Upto ₹30 Lakhs

Thomas More University Expands Global Reach with First-ever Visit to India

Introducing 'Kanchi Cafe': A Divine Culinary Experience in the Heart of Hitec City