చంపాపేటలో అత్యాధునిక కార్డియాలజీ ఆస్పత్రి

ఓనస్ ఆస్పత్రిలో సరికొత్త విభాగం ప్రారంభం * ప్రారంభించిన తెలంగాణ ప్రణాళికా మండలి వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి * కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు హైదరాబాద్, జూన్ 30, 2024: నగరంలోని చంపాపేట ప్రాంత వాసులకు అత్యున్నత స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు ఓనస్ రోబోటిక్, కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొత్తగా అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రణాళికా మండలి వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి చేతుల మీదుగా ఈ విభాగం ప్రారంభమైంది. కార్యక్రమంలో ఇంకా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ఎన్.ప్రకాష్ రెడ్డి ఐపీఎస్, యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, ఐఎస్ సదన్ మాజీ కార్పొరేటర్ స్వప్నా సుందర్ రెడ్డి, చంపాపేట కార్పొరేటర్, బీజేపీ ఎల్బీనగర్ కన్వీనర్ వంగా మధుసూదన్ రెడ్డి, గాయత్రినగర్ కార్పొరేటర్ సబితా రాజశేఖర్ రెడ్డి, లి...