హైదరాబాద్‌లో టూరో యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్లు, విద్యార్థులకు 5000 డాలర్ల స్కాలర్‌షిప్‌

 అత్యాధునిక విద్యకు పేరొందిన‌ టూరో యూనివర్సిటీ ఈ నెల ప‌దో తేదీ శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనుంది. అంత‌ర్జాతీయ విద్య అవ‌కాశాల‌ను ఇక్క‌డి విద్యార్థుల‌కు అందించే గెట్2యూని సహకారంతో టూరో యూనివర్సిటీ భావి విద్యార్థుల కోసం ప్రత్యేక స్పాట్ అడ్మిషన్ ఆఫర్లు, స్కాలర్ షిప్ లను ప్రకటించింది.

వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు పవన్ ఎ శ్రీవాస్తవ నేతృత్వంలోని గెట్2యూని ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు విస్తృతమైన నియామక అనుభవం, వ్యక్తిగత మద్దతును అందిస్తుంది. టూరో యూనివ‌ర్సిటీ ప్రయత్నాలను బలోపేతం చేస్తూ, గెట్ 2యూని... విదేశాల్లో చ‌దువుకోవాల‌న్న విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడంలో సాధికారత కల్పిస్తుంది.

స్పాట్ అడ్మిషన్స్ కార్య‌క్ర‌మానికి హాజరయ్యే భావి విద్యార్థులు టూరో యూనివర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుని, వారి చదువుల కోసం ప్రత్యేకంగా 5000 డాలర్ల స్కాలర్ షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కాలర్ షిప్ విద్యార్థుల చ‌దువుకు మద్దతు ఇవ్వడానికి టూరో విశ్వవిద్యాలయం నిబద్ధతను నొక్కి చెబుతుంది.

వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో విద్యార్థులను విజయానికి సిద్ధం చేయడం, పరివర్తనాత్మక విద్యా అనుభవాలను అందించడం టూరో యూనివర్సిటీ లక్ష్యమ‌ని విలేక‌రుల‌కు ఈ యూనివర్సిటీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ సంద‌ర్బంగా వ్యూహాత్మక కార్యక్రమాల అసోసియేట్ ప్రొవోస్ట్ డాక్టర్ రీమా అరన్హా మాట్లాడుతూ, సాంకేతిక విద్యలో నైపుణ్యం కోసం యూనివర్సిటీ చూపించే అంకితభావాన్ని తెలిపారు.  విద్యార్థులు నాయకులుగా, ఆవిష్కర్తలుగా మారడానికి సాధికారత కల్పిస్తామ‌ని ఆమె చెప్పారు.

టెక్నాలజీపై దృష్టి సారించిన టూరో యూనివర్సిటీ వైద్య‌శాస్త్రాలు, విద్య, వ్యాపారంతో సహా వివిధ విభాగాలలో వివిధ రకాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంల‌ను అందిస్తుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్ మెంట్ అండ్ ఎన్ రోల్ మెంట్ డైరెక్టర్ జేమ్స్ షాఫర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించడానికి నైపుణ్యాలను సమకూర్చడంలో యూనివర్సిటీ చూపే నిబద్ధతను వివరించారు.

టూరో యూనివర్సిటీలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఈ నెల 10న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ లో జరిగే స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. విద్య విష‌యంలో క‌ఠినంగా ఉంటూనే.. అనుభవం, అంకితభావం క‌లిగిన‌ అధ్యాపకుల మార్గదర్శకత్వంతో టూరో యూనివర్సిటీ విద్య విష‌యంలో సృజనాత్మకతలో ముందంజలో ఉంది.

టూరో యూనివర్సిటీ, దాని కార్యక్రమాలు, స్పాట్ అడ్మిషన్ల‌ గురించి మరింత సమాచారం కోసం, దయచేసి సంప్రదించండి - ఇమెయిల్: Junaid@get2uni.com

 


 

Comments

Popular posts from this blog

Kid with Rare Alagille Syndrome gets a New Lease of Life with Successful Liver Transplantation at CARE Hospitals

Indigenous Indian Surgical Robot SSI MANTRA Makes Breakthrough in Pediatric Surgery

Retailers Discuss Ways to Stay Ahead of the Curve at the RAI Hyderabad Retail Summit 2024