మార్చి 6న చిన్న జీయర్ చేతుల మీదుగా స్వర్ణగిరి దేవాలయం విగ్రహ ప్రాణ ప్రతిష్ట

అఖిలభువన జన్మస్తేమ భంగాది లీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటీ బ్రహ్మాండ నాయకుడు , కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణా , యాదాద్రి భువనగిరి జిల్లా , భువనగిరి సమీపంలో నిర్మింపబడినది . పరమహంస పరివ్రాజకులు , ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో , ప్రముఖ వ్యాపార వేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు , వారి ధర్మపత్ని శ్రీమతి విజయ లక్ష్మీ పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారము గా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ , శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారల నేతృత్వం లో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది . సుమారు 22 ఎకరాల ప్రాంగణం లో “ స్వర్ణగిరి ” అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ , తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ , ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా “ యాదాద్రి తిరుమల దేవస్థానం ” పేరు...