కోట్ల విలువచేసే భూమి చుట్టూ రాజకీయాలు

* కుంట్లూరులో 1750 గజాల భూమిపై నేతల కన్ను * దాన్ని ప్రభుత్వ భూమిగా చెప్పిన తహసీల్దార్ * కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నా కబ్జా చేస్తున్న గౌడ సంఘం హైదరాబాద్, ఆగస్టు, 2023: అది హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరు మదర్ డెయిరీ సమీపంలో ఉన్న 1750 గజాల విలువైన భూమి. గజం భూమి విలువ రూ. 35 వేల నుంచి రూ.45 వేల వరకు ఉండే ఈ ప్రాంతంలో కనీసం రూ.7 కోట్లకు పైగా విలువ చేసే ఈ ప్రైవేటు భూమిపై రాజకీయ గద్దల కన్ను పడింది. సర్వే నెంబర్ 206లో ఉన్న ఈ భూమిని బాధితులు మూడు దశాబ్దాల క్రితమే.. 1990లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. దీని పక్కనే ఉన్న సర్వే నెంబర్ 159లో ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని గౌడ సంఘానికి ప్రభుత్వం కేటాయించి, అక్కడ కార్యాలయం నిర్మించుకోవచ్చని తెలిపింది. అయితే, సదరు సంఘ సభ్యులు మాత్రం పక్కనే ఉన్న సర్వే నెంబర్ 206లోని ప్రైవేటు భూమిని కూడా కబ్జా చేసి, అందులో పునాదులకు గుంతలు తీయడం మొదలుపెట్టారు. ఇది నూటికి నూరుశాతం పట్టాభూమి కావడం, దీన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియడంతో బాధితులు 2023 ఫిబ్రవరిలో ...