సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ

 చేనేతకళాకారుల నైపుణ్యం గొప్పదని, చేనేతపరిశ్రమను ప్రోత్సహించాల్సిన భాద్యత అందరిపై ఉందని తెలంగాణా స్టేట్ పోలీస్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ జి. వైజయంతి అన్నారు. శుక్రవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఆద్వర్యంలో శారీస్ ఆఫ్ ఇండియా ఫ్యాషన్ పేరిట శ్రావణమాస వెడ్డింగ్ స్పెషల్ ప్యాషన్ షోను ఏర్పాటుచేశారు. ఈనెల 8 నుండి 16వరకూ నిర్వహించబోతున్న ఎగ్జిబిషన్కు సంబంధించి దేశంలోని ప్రముఖ నగరాలను చెందిన చేనేతకళాకారుల చీరలను మోడల్స్ ధరించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వైజయంతి ముఖ్య అతిథిగా హాజరై ఇక్కడ నాణ్యమైన సిల్క్, కాటన్ చీరలు లభిస్తాయని, చేనేతకారుల ఉత్పత్తులను నేరుగా ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. చేనేతకళాకారులను ప్రోత్సహిస్తున్న ఇండియన్ సిల్క్ గ్యాలరి నిర్వాహకులు శ్రీనివాసరావు, వినయ్ కుమార్ లని అభినందించారు. మోడల్స్ ప్రదర్శించిన రంగురంగుల చీరలు అమితంగా ఆకట్టుకున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఈ ప్రదర్శను ఏర్పాటుచేశామని, ఎక్కడా దొరకని సరికొత్త బెనారస్ చీరలు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు వినయ్ తెలిపారు. కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్, చేనేతకళాకారులు పాల్గొన్నారు.


 

Comments

Popular posts from this blog

Kid with Rare Alagille Syndrome gets a New Lease of Life with Successful Liver Transplantation at CARE Hospitals

Indigenous Indian Surgical Robot SSI MANTRA Makes Breakthrough in Pediatric Surgery

Retailers Discuss Ways to Stay Ahead of the Curve at the RAI Hyderabad Retail Summit 2024